telugu navyamedia
సినిమా వార్తలు

బిగ్‌బాస్‌: ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న కంటెస్టెంట్స్ వీళ్ళే..

బుల్లితెర అతిపెద్ద రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌’. నాగార్జున హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్‌ ‘సీజన్‌5’ ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. 19మంది కంటెస్టెంట్‌లు హౌస్‌లోకి వెళ్లారు. కాగా, మొదటివారం నామినేషన్‌ ప్రక్రియ పూర్తయింది. మొత్తానికి మొదటి వారంలో ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు ఆరుగురు నామినేట్ అయ్యారు. ఇందులో యాంకర్ రవి, కాజల్, జెస్సీ, సరయు, హమీద, మానస్ నామినేట్ అయ్యారు.

‘బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉండటానికి అర్హులు కాని ఇద్దరు వ్యక్తుల పేర్లు, అందుకు కారణాలు చెప్పి ఎలిమినేషన్‌ ప్రక్రియ మొదలు పెట్టండి’ అని బిగ్‌బాస్‌ సూచించారు. ఈ సందర్భంగా చెత్త బ్యాగ్ ను డస్ట్ బిన్ లో వేయాల్సి ఉంటుంది. హౌస్‌మేట్స్‌ ఫొటోలు ముద్రించిన బ్యాగులను ఉంచారు. ప్రతి ఒక్కరూ ఇద్దరు కంటెస్టెంట్‌లను ఎంచుకుని వారి ఫొటో ఉన్న బ్యాగును చెత్త డబ్బాలో వేయాలి. అత్యధిక మంది జస్వంత్‌ను నామినేట్‌ చేశారు. మొదటి వారం ఎవరికి మూడుతుందో చూడాలి. అయితే ఎక్కువగా జెస్సీ ఎలిమినేట్ అయ్యే అవకాశాలే ఉన్నట్టు కనిపిస్తోంది.

Related posts