త్రివిక్రమ్, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ మరోసారి ఈ ఇద్దరు కలిసి పనిచేయబోతున్నారనే వార్త టాలీవుడ్ లో తెగ చక్కర్లు కొడుతోంది. అయితే ఈసారి వీరు సినిమా కోసం కలిసి పనిచెయ్యడం లేదు. టాలీవుడ్ అగ్ర నిర్మాత, బన్నీ తండ్రి అల్లు అరవింద్ ఇటీవలే ‘ఆహా’ పేరుతో డిజిటల్ ప్లాట్‌ఫాం ప్రారంభించిన సంగతి తెలిసిందే. తాజాగా అల్లు ఆర్జున్ తో దాన్ని ప్రమోట్ చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. దీనిలో భాగంగా అర్జున్ పై తెరకెక్కించే సన్నివేశాలకు త్రివిక్రమ్ దర్శకత్వం వహించనున్నారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. కోవిడ్ లాక్ డౌన్ ముగిసిన అనంతరం చిత్రీకరణ ప్రారంభిస్తారని తెలుస్తోంది. ఇటీవలే ఈ ఇద్దరి కలయికలో రీసెంట్ గా వచ్చిన ‘అల వైకుంఠపురములో’ బ్లాక్ బాస్టర్ విజయం అందుకుంది. ఇదిలా ఉండగానే మరోసారి కలిసి పనిచేస్తుండటంతో ఫ్యాన్స్ లో ఆసక్తి పెరుగుతోంది
previous post