telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోషల్ మీడియాలోకి మెగాస్టార్ ఎంట్రీ

chiru

నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకుని మెగాస్టార్ చిరు సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యారు. బుధవారం ఉదయం 11 గంటల 11 నిమిషాలకు తన అధికారిక ట్విట్టర్ అకౌంట్‌ను ప్రారంభించారు. తెలుగు ప్రజలందరికీ శార్వరి నామ ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. చిరు తన ట్విట్టర్ అకౌంట్ ప్రారంభించిన క్షణాల్లోనే వేల సంఖ్యలో అభిమానులు ఫాలోఅవ్వడం ప్రారంభించారు.తన తొలి ట్వీట్ అన తరం ప్రధాని మోదీ మంగళవారం ఇచ్చిన 21 రోజుల లాక్ డౌన్ ఉద్దేశించి మరో ట్వీట్ చేశారు. ‘‘అంద‌రికీ శార్వ‌రి నామ ఉగాది శుభాకాంక్ష‌లు. నా తోటి భార‌తీయులంద‌రితో, తెలుగు ప్ర‌జ‌ల‌తో, నాకు అత్యంత ప్రియ‌మైన అభిమానులంద‌రితో నేరుగా ఈ వేదిక నుంచి మాట్లాడ‌గ‌ల‌గ‌టం నాకెంతో ఆనందంగా ఉంది. ఈ సంవ‌త్స‌రాది రోజు ప్ర‌పంచాన్ని కుదిపేస్తున్న కోరోనా మ‌హ‌మ్మారిని క‌లిసి క‌ట్టుఆ జ‌యించ‌డానికి కంక‌ణం క‌ట్టుకుందాం. ఇంటి ప‌ట్టునే ఉందాం. సుర‌క్షితంగా ఉందాం’’ అంటూ ట్వీట్ చేవారు. ఇక రెండో ట్వీట్‌లో.. `21 రోజులు మనందరినీ ఇళ్లలోనే ఉండమని మన భారత ప్రభుత్వం ఇచ్చిన ఆదేశం కరోనా మహమ్మారిని ఎదర్కోవటానికి ఓ అనివార్యమైన చర్య. ఈ క్లిష్ట సమయంలో మనం, మన కుటుంబాలు, మన దేశం సురక్షితంగా ఉండటానికి మన ప్రియ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు, మన ప్రియ ముఖ్యమంత్రులు శ్రీ కేసీఆర్ గారు, శ్రీ జగన్ గారు ఇచ్చే ఆదేశాలను పాటిద్దాం. ఇంటు పట్టునే ఉందాం. సురక్షితంగా ఉందామ`ని రెండో ట్వీట్ చేశారు.

Related posts