telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

శరవేగంగా సాగుతున్న నారప్ప షూటింగ్…

narappa

ప్రపంచాన్ని వణికించిన కరోనా కారణంగా దేశంలో అన్నింటిని నిలిపివేసిన సంగతి తెలిసిందే. వాటిలో సినిమాలు కూడా ఉన్నాయి. అయితే ఇటీవల లాక్‌డౌన్‌ను తొలగించడంతో సినిమాలు వాటి చిత్రీకరణను మొదలుపెట్టాయి. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ చేస్తున్న సినిమా నారప్ప. ఈ సినిమా కూడా తన షూటింగ్‌ను ప్రారంభించింది. కాకపోతే సినిమా షూటింగ్ అంటే ఇంతకు ముందులా జనం ఉండరు. కుదిరినంత తక్కువ మందితోనే పనిచేయాలి. కానీ నారప్పలో ఓ సన్నివేశం కోసం ఎక్కువ మందితో చిత్రీకరించింది చిత్ర యూనిట్. ఈ సినిమా షూటింగ్ విషయంలో వెంకటేష్ కాస్త వేగం చూపుతున్నాడు. డిసెంబరు నాటికి సినిమాను పూర్తిచేయాలని ప్రయత్నిస్తున్నారు. దానికి అసలు కారణం ఏటంటే ఎఫ్3 సినిమాకు సంబంధించిన చిత్రీకరణ త్వరలోనే ప్రారంభించనున్నారు. అందుగాను వెంకటేష్, వరుణ్ తేజ్‌లు డిసెంబరు నాటికి ఫ్రీ అవ్వాలి. అందుకనే ఎంతో బిజీ షెడ్యూల్ వేసుకుని మరీ వెంకటేష్ కష్ట పడుతున్నాడు. ఇదిలా ఉంటే ఈ నారప్ప సినిమా తమిళ సినిమా అసురన్‌కు రీమేక్ అవ్వడంతో తెలుగులోను కమర్షియల్ సక్సెస్ అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. ప్రిచమణి, రెబ్బ మోనికాజాన్ హీరోయిన్‌లుగా చేస్తన్నారు. మరి ఈ సినిమాను ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఆదరిస్తారో చూడాలి మరి.

Related posts