telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఫ్యామిలీతో ‘హోలీ’ సెలెబ్రేషన్స్ జరుపుకున్న ఎన్టీఆర్

ntr

ట్విట్ట‌ర్ వేదిక‌గా భార్య ల‌క్ష్మీ ప్ర‌ణ‌తి, కుమారులు అభ‌య్ రామ్‌, భార్గ‌వ్ రామ్‌ల‌తో క‌లిసి ఉన్న ఫొటోను షేర్ చేస్తూ హోలీ శుభాకాంక్షల్ని తెలియజేశారు ఎన్టీఆర్. ఫ్యామిలీ స‌భ్యులు అంద‌రు ఇలా ఒకే ఫ్రేములో క‌నిపించ‌డం చూసిన ఫ్యాన్స్ ఈ ఫొటోను లైక్స్ అండ్ రీ ట్వీట్‌లతో హోరెత్తిస్తున్నారు. ముఖ్యంగా ఎన్టీఆర్ పిల్లలు చాలా క్యూట్‌గా కనిపిస్తున్నారు. కాగా ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో ‘ఆర్ ఆర్ ఆర్’ చిత్రంలో నటిస్తున్నారు. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ షూటింగ్ అప్డేట్స్ విషయానికి వస్తే.. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపించబోతున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది ఆర్ ఆర్ ఆర్ చిత్రం.

Related posts