telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

చిన్న పురుగుకు నేను భయపడను : కరోనాకే కౌంటర్‌ వేసిన వర్మ

RGV

సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో వర్మ “మన ఖర్మ” పుస్తకాన్ని ఆవిష్కరించారు ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు. “ఈ పుస్తకం పేరు నెగిటివ్ గా ఉన్నా.. బుక్ చదివితే నా జీవితం మొత్తం ఉంది…నేను ఎప్పుడూ ఒక ఫిలాసఫర్ ను ఫాలో కాలేదు. నేను ఏది సీరియస్ గా తీసుకోను. ఒక పెళ్ళిలో ఒక ఐపిఎస్ ఆఫీసర్ కలిశారు. మీ పుస్తకం వల్ల మా ఇంట్లో గొడవలు జరుగుతున్నాయ్ అని చెప్పారు. నేను మాట్లాడిదే పిచ్చి వాగుడు అనొచ్చు. ఇంటలెక్చువల్ అని మరికొందరు అనొచ్చు. నా గురించి ఏమి రాస్తారో, రాసారో అని ఎదురు చూడను. ప్రతి మనిషులో ఒక మృగం, రాక్షసుడు ఉంటాడు. బ్యాడ్ ను కప్పి పెట్టి మంచిగా ఉండాలని చూస్తుంటారు. నువ్వనుకున్నదే చేయి.. నీలానే ఉండటానికి ప్రయత్నించు. బంధాల నుంచి బయటకు రాలేనప్పుడు అప్పుడు నిజం గుర్తుకు వస్తది. నేను ఈ పుస్తకం ఇంకా చదవలేదు. నేను పుస్తకం రాస్తే… ఎలా కాపీ కొడతారు అనే దానిపై పుస్తకం రాస్తా. నేను ప్రాబ్లమ్ గురించి పట్టించుకోలేదు. మా అమ్మ నన్ను చాలాసార్లు కొట్టారు. అప్పుడు వర్మ మా కర్మ అని అనుకుని ఉండొచ్చు కరోనా కోసం నా లైఫ్ స్టయిల్ మార్చుకోను. చిన్న పురుగుకు నేను బయపడను” అంటూ వర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related posts