telugu navyamedia
సినిమా వార్తలు

ఆదిపురుష్‌ రిలీజ్‌ డేట్‌ వ‌చ్చేసింది…ఎప్పుడంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతినిండా సినిమాల‌తో పుల్ బిజీ బిజీగా ఉన్నాడు..ప్రభాస్‌ పాన్‌ ఇండియా చిత్రాల్లో ఆది పురుష్‌ ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ ఓంరౌత్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తోన్న సినిమా ఆదిపురుష్ . ఇందులో ప్ర‌భాస్‌ సరసన కృతి సనన్ నటిస్తుండగా.. మరో స్టార్‌ సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలో నటిస్తున్నాడు.

ఎంతో ఆసక్తిగా అభిమానులు ఎదురుచూస్తున్న సినిమాల్లో ప్రభాస్​ ‘ఆదిపురుష్​ ఒకటి. నేడు శివరాత్రి సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ కొత్త అప్డేట్​ను ఇచ్చింది చిత్రబృందం. ఈ నేపథ్యంలో ఈ రోజు శివ రాత్రి సందర్భంగా దర్శకుడు ఓం రౌత్‌ ఆది పురుష్‌ నుంచి బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చాడు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా వచ్చే ఏడాది 2023 జనవరి 12న విడుదల చేయనున్నట్లు ప్రకటించాడు. అంతేకాకుండా.. ఈ చిత్రాన్ని 3D వెర్షన్‏లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిపాడు.దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

Adipurush, Full On Green Mat

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులతో పాటు పలు టెక్నికల్‌ వర్క్స్‌తో మూవీ టీం ఫుల్‌ బిజీగా ఉంది.  రామాయణ మహాకావ్యాన్ని ఆధారంగా చేసుకుని రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్‌ రాముడి పాత్రలో నటి కృతిసనన్‌ సీత పాత్రలో నటించారు. టీ సిరీస్​, రెట్రోఫైల్స్​ ప్రైవేట్​ లిమిటెడ్​ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సైఫ్‌ అలీఖాన్‌ లంకేశుడిగా, బాలీవుడ్​ నటుడు సన్నీ సింగ్​ లక్ష్మణుడి పాత్రలో, మరాఠి నటుడు దేవ్​దత్త నగే హనుమంతుడిగా కనువిందు చేయనున్నారు.

Related posts