telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

మరో పాక్ క్రికెటర్ .. భారత అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడట.. దీనివెనుక రహస్యం..?

another pak cricketer will marry indian women

పాక్ క్రికెటర్లు భారత అమ్మాయిలను పెళ్లాడడం సాంప్రదాయం అయ్యేట్టుగానే ఉంది. నాటి పాక్ క్రికెట్ దిగ్గజం జహీర్ అబ్బాస్, ఆల్ రౌండర్ షోయబ్ మాలిక్ కూడా భారతీయ యువతులనే పెళ్లాడారు. షోయబ్ మాలిక్ హైదరాబాదీ టెన్నిస్ క్వీన్ సానియా మీర్జాను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కోవలో పాక్ పేస్ బౌలర్ హసన్ అలీ కూడా చేరుతున్నాడు. హసన్ అలీ వివాహం హర్యానాకు చెందిన షమియా అర్జూతో ఆగస్టు 20న జరగనుంది. ఈ పెళ్లి దుబాయ్ లో జరగనున్నట్టు సమాచారం.

హసన్ అలీ వయసు 25 ఏళ్లు. దుబాయ్ లో ఓ సన్నిహితుడి ద్వారా షమియాతో హసన్ అలీకి పరిచయం ఏర్పడింది. ఇంగ్లాండ్ లో ఏరోనాటికల్ ఇంజినీరింగ్ చదివిన షమియా, గతంలో దుబాయ్ కేంద్రంగా జెట్ ఎయిర్ వేస్ లో పనిచేసింది. హసన్ అలీ విషయానికొస్తే 2017 చాంపియన్స్ ట్రోఫీలో పాక్ విజేతగా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు. పెళ్లివరకు బాగానే ఉంది.. అయితే వీరందరూ పెళ్లి తరువాత సంతోషంగానే ఉన్నారా.. భారతీయులపై ఇది కూడా ప్రతీకార చర్యేనా .. వాళ్ళు హింసకు గురవుతున్నారా.. ఇప్పుడు ఈ ప్రశ్నలన్నీ నెట్ ఇంట్లో వైరల్ అవుతున్న ప్రశ్నలు.. వీటికి జవాబు ఎవరు చెప్పాలో మరి!

Related posts