telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ త్యాగానికే పడిపోయా… అమలాపాల్

amalapal

కేరళ బ్యూటీ అమలాపాల్ దర్శకుడు విజయ్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరిద్దరూ కొన్ని అనివార్య కారణాలతో విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అమలాపాల్ ప్రేమలో పడింది. కానీ, ప్రియుడు ఎవరో మాత్రం సస్పెన్స్ గా ఉంచింది. ఇంతకీ ఆ బోయ్ ఫ్రెండ్ ఎవరా అని నెటిజన్లు తెగ సెర్చ్ చేశారు. తనకోసం ఏకంగా ఉద్యోగాన్నే త్యాగం చేసిన వ్యక్తిని తాను ప్రేమిస్తున్నానంటూ ఆమె చెప్పకనే చెప్పేసింది. కానీ, పేరు చెప్పేందుకు మాత్రం ఇష్టపడలేదు. వీరద్దరి ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. బుర్కా ధరించి ఉన్న అమలాపాల్ వెంట ముంబై సింగర్‌ భవ్నీందర్‌ సింగ్‌ ఉన్నట్టుగా కనిపిస్తోంది. గతంలోనూ భవ్నీందర్‌ ఆడై (ఆమె) సినిమా ప్రమోషన్ల సందర్భంగా.. నా ప్రియురాలిని చూసి గర్విస్తున్నాను. ఇలాంటి మూవీలతో ప్రేక్షకులకు వినోదాన్ని అందించు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు పెట్టాడు. అతను ఒక ఫొటో షేర్ చేయగా అది మరింత బలానిస్తోంది.

Related posts