telugu navyamedia
సినిమా వార్తలు

ట్విట్టర్ లో ఎన్టీఆర్ మైల్ స్టోన్

Jr.ntr actor Ycp photos social media

ఒక స్టార్ హీరోకి సంబంధించిన ఏ విషయమైనా సోషల్ మీడియాలో వారి అభిమానుల హడావుడితో హాట్ టాపిక్కై ట్రెండింగ్‌గా మారుతోంది. అందుకే సెలెబ్రిటీలు కూడా తమకు సంబంధించిన విషయాల్ని ఎప్పటికప్పుడు తమ సోషల్ మీడియా ఖాతాల్లో ఫ్యాన్స్‌తో పంచుకుంటూ ఉంటారు. తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో రేర్ ఫీట్ సాధించాడు. 2009లో ట్విట్టర్‌లో జాయిన్ అయిన తారక్.. తాజాగా మూడు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించి అరుదైన మైలురాయిని అందుకున్నాడు. అయితే పదేళ్ల నుంచి ట్విట్టర్‌లో కొనసాగుతున్నా ఎన్టీఆర్ చేసినవి 370 ట్వీట్లు మాత్రమే కావటం విశేషం. మూడు మిలియన్ల ఫాలోవర్స్‌ను సంపాదించిన తారక్ టాలీవుడ్ నుంచి ట్విట్టర్‌లో ఏడో స్థానంలో నిలిచాడు. ఇక తెలుగు కథానాయకుల్లో 3.09 మిలియన్ల ఫాలోవర్లతో అల్లు అర్జున్ ఆరవ స్థానంలో, 3.25 మిలియన్ల ఫాలోవర్లతో నాని ఐదవ స్థానాన్ని, 3.53 మిలియన్ల ఫాలోవర్లతో పవన్ కళ్యాణ్ నాల్గవ స్థానంలో ఉన్నారు. ఇక 5.66 మిలియన్ ఫాలోవర్లతో రానా మూడో ప్లేస్‌లో, 5.72 ఫాలోవర్లతో నాగార్జున రెండో స్థానంలో ఉండగా 7.6 మిలియన్ల ఫాలోవర్లతో మహేశ్ బాబు ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు.

Related posts