telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

కరోనా ఎఫెక్ట్ : స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లు బంద్…!

karona

భారత్‌లో కరోనా వైరస్ కేసుల సంఖ్య 74కి చేరిందని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఏపీలోనూ నెల్లూరు యువకుడికి కరోనా పాజిటివ్ అని తేలిందని డాక్టర్లు ధ్రువీకరించారు. ఆంధ్రాలో నమోదైన తొలి కరోనా కేసు ఇదే కావడం గమనార్హం. దేశంలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న వేళ దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నంబర్లను ప్రభుత్వం విడుదల చేసింది. కోవిడ్ ప్రభావంతో రాష్ట్రాలు అప్రమత్తం అవుతున్నాయి. మార్చి 31 వరకు స్కూళ్లు, కాలేజీలు, సినిమా హాళ్లను మూసివేస్తున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. పరీక్షలు లేని స్కూళ్లకు సెలవులు వర్తిస్తాయని కేజ్రీవాల్ సర్కారు తెలిపింది. కేరళ, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వాలు కూడా సినిమా హాళ్లను మూసి వేయాలని నిర్ణయం తీసుకున్నాయి. కోవిడ్ మహమ్మారి ప్రబలుతున్న నేపథ్యంలో హోళీ సెలవును పొడిగించే విషయమై సుప్రీం కోర్టు శుక్రవారం నిర్ణయం తీసుకోనుంది. వారం రోజులపాటు సెలవులను పొడిగించాలా లేదంటే అత్యవసర కేసులను మాత్రమే వాదించాలా అనే విషయాన్ని ధర్మాసనం శుక్రవారం తేల్చనుంది. కోవిడ్‌ వ్యాప్తితో ముందు జాగ్రత్త చర్యగా శుక్రవారం నుంచి రాష్ట్రపతి భవన్‌ను సందర్శించడానికి సాధారణ ప్రజలకు అనుమతి ఇవ్వరు. తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు రాష్ట్రపతి భవన్ సందర్శనను మూసివేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రపతి భవన్ మ్యూజియం కాంప్లెక్స్‌తోపాటు ఛేంజ్ ఆఫ్ గార్డ్ సెర్మోనీని కూడా ప్రజలు తిలకించలేరు.

Related posts