రంగారెడ్డి జిల్లా పరిధిలోని 5 మైనార్టీ గురుకుల జూనియర్ కళాశాలల్లో, 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారిణి రత్నకల్యాణి ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని హయత్‌నగర్, శేరిలింగంపల్లి(బాలురు), ఇబ్రహీంపట్నం (సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్), రాజేంద్రనగర్, ఫరూఖ్‌నగర్(బాలికల) మొదటి సంవత్సరం ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ గ్రూపులలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
అలాగే 9 మైనార్టీ గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి ప్రవేశం కొరకు అర్హులైన మైనార్టీ అభ్యర్థులు 2020-21 విద్యా సంవత్సరానికి గాను దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ప్రవేశ పరీక్ష జూనియర్ ఇంటర్ వారికి ఏప్రిల్ 12న, 5వ తరగతి వారికి ఏప్రిల్ 18వ తేదీన, 6 నుంచి 9వ తరగతి వారికి ఏప్రిల్ 20న నిర్వహిస్తారన్నారు. ఆసక్తిగల విద్యార్థులు http://temris.telangana .gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఎంపికైన విద్యార్థుల జాబితా మే 2న ప్రకటిస్తామని తెలిపారు.
ఎగ్జిట్ పోల్స్ తో జగన్ సంబురపడిపోతున్నారు: దేవినేని ఉమ