telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఈ బీభత్సము… ఎవరి నిర్లక్ష్యం ?

ఇది మనుషుల నిర్లక్ష్యమా…? 

విషపురుగు వీరంగమా…?

ఇది కలికాలం పాపమా…?

కరోనా విలయతాండవ కాలమా…?

 

సామాజిక బాధ్యత లేక అజాగ్రత్తగా ఉంటూ…

కరోనా కాటుకు బలియై కన్నీరు కార్చేవారెందరో..

చేతులు కాలినాక 

ఆకులు పట్టుకున్నట్లు

శవాలుగా మారుతున్న కుటుంబాలేన్నో…

చదువుకున్న 

అజ్ఞానులు ఒకవైపు

నిరక్షరాస్యత 

నిరుపేదలు మరోవైపు

పోలీస్, డాక్టర్స్,

మీడియాలు 

ఎవరెన్ని సలహాలిచ్చిన

మనుషుల నిర్లక్ష్యపు ధోరణితో బతుకును చితిపాలు చేస్తున్నరు

దవాఖానాల్లో మంచాలులేక 

పీల్చెందుకు వాయువులేక

ప్రాణాలేన్నో పోతున్నాయి

 

తల్లి కొరకు బిడ్డ 

బిడ్డ కొరకు తల్లి 

తాకలేని రోగంతో 

తల్లడిల్లి పోతున్నరు

చివరి చూపు చూడలేక 

కన్నీటి కళ్ళలోనే 

చితిమంటలు

రగులుతున్నవి

మనకొరకే కాక 

పరులకొరకు యోచించి 

మాస్కులు పెట్టి 

భౌతిక దూరం పాటిస్తే

కరోనా పురుగును 

పాతరేసి చంపగలం

 

ఎన్నికల గెలుపులకై  

స్వార్ధంతో నాయకులు 

డబ్బిచ్చి నిరుపేదనుకొని

ఊరేగుతూ వైరస్ ని పెంచిరి

చేతులెత్తేసిన ప్రభుత్వాలు 

వేగం లేని సముద్రంలా..

కోరలు తీసిన పాములా…

రాహువు మింగిన సూర్యుడిలా… 

ప్రజలను చూస్తూ..ఉన్నది

మనని మనమే కాపాడుకునే 

బాధ్యత మనదే

 

 

Related posts