telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఓటీటీలోకి సునీల్ మూవీ..!

స్టార్‌ కమెడియన్‌గా కెరీర్ పీక్స్ లో ఉండగానే ‘అందాల రాముడు’ సినిమాతో హీరోగా టర్న్ తీసుకున్నారు సునీల్. ఈ సినిమా విజయం సాధించడంతో ఆ తర్వాత పూలరంగడు, మర్యాద రామన్న.. వంటి చిత్రాలతో హీరోగా ప్రేక్షకులను అలరించాడు సునీల్. అయితే ఈ సినిమాలతో విజయాలు అందుకున్నా హీరో గా మాత్రం నిలదొక్కుకోలేకపోయారు. వరుసగా సినిమాలన్నీ ఫ్లాపులు కావడంతో ఆయనకు ఛాన్సులు ఇచ్చేవారే కరువయ్యారు. ఈ నేపథ్యంలోనే ఇటీవల వచ్చిన ‘కలర్ ఫోటో’లో విలనిజం చూపించి ప్రేక్షకులను మెప్పించారు. అయితే కమెడియన్‌గా ఇప్పుడు ఆయనకు మళ్లీ ఆఫర్లు ఊపందుకున్నాయి.  ఈ తరుణంలోనే సునీల్ మళ్లీ హీరోగా నటించబోతున్నాడన్న వార్త హల్చల్ చేస్తోంది. లేటెస్ట్‌ సమాచారం మేరకు సునీల్‌ హీరోగా ఓ సినిమాను పరిమిత బడ్జెట్‌లో దర్శకుడు వి. ఎన్‌. ఆదిత్య తెరకెక్కించాలని ప్లాన్‌ చేసుకున్నాడట. నిర్మాత అనీల్‌ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించి… ఓటీటీలో ఆ సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అయితే.. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.. 

Related posts