telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

సింహాన్ని బంధించి ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు…

Atchannaidu tdp

ఈ రోజు సింహాన్ని బంధించి ఎన్నికలు జరిపించాలనుకుంటున్నారు అని ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. అయితే అచ్చెన్నాయుడుకి బెయిల్‌ వచ్చిన విషయం తెలిసిందే. అయితే జైలు నుంచి విడుదలయ్యాక అచ్చెన్నాయుడు ఉధ్వేగానికి గురయ్యాడు. మీడియాతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చేయని తప్పుకు, సంబంధంలేని ఇష్యూకి నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు అని అన్నాడు. అరెస్ట్ చేసినందుకు నేను భయపడటం లేదు , బాధపడటం లేదు. 1978 నుంచి రాజకీయాల్లో ఉన్న కుటుంబం మాది. నిమ్మాడ పంచాయతీ ఎప్పుడూ ఏకగ్రీవంగానే కొనసాగుతోంది అని చెప్పిన ఆయన నాపై ఈ ప్రభుత్వం కక్ష కట్టింది. అందుకే మేం ఈసారి ఏకగ్రీవం కావాలని కోరుకోలేదు. అప్పన్న సోదరుడు కోరినందునే అప్పన్నకు ఫోన్ చేశాను. ఫోన్ కాల్ సంభాషణ రికార్డవుతుందని నేను ఊహించలేదు. అయిన నేను ఫోన్ కాల్ లో బెదిరించినట్లు ఎవరైనా నిరూపించండని సవాల్ విసురుతున్నా అని అన్నారు. నేను బెదిరించానని నిరూపిస్తే …ఇప్పటికిప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటా.. నాకు జరిగిన అన్యాయానికి పోరాటం చేస్తా. ఏకగ్రీవాల కోసం ఒత్తిడి తెచ్చినా మా కార్యకర్తలు ధైర్యంగా నిలబడ్డారు అని తెలిపారు.

Related posts