telugu navyamedia
క్రీడలు వార్తలు

నేను వెజిటేరియన్‌ అని ఎప్పుడూ చెప్పలేదు : కోహ్లీ

Virat

తాజాగా ఇన్‌స్టా వేదికగా అభిమానులతో చిట్ చాట్ చేసిన కోహ్లీ.. ఓ అభిమాని అడిగిన ప్రశ్నతో తన డైట్‌కు సంబంధించిన విషయాలను వెల్లడించాడు. తనడైట్‌లో కూరగాయాలు, గుడ్లు, కాఫీ, పప్పు, పాలకూర, దోషాలు ఉంటాయన్నాడు. అయితే వీటన్నిటిని కంట్రోల్‌గా తీసుకుంటానని తెలిపాడు. ఇక విరాట్ గుడ్లు తింటానని చెప్పడంపై అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మాంసం తినడం లేదని, పూర్తిగా వెజిటేరియన్‌గా మారనని గతంలో చెప్పిన కోహ్లీ ఇప్పుడేలా గుడ్లు తింటున్నాడని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలనే ప్రస్తావించిన అభిమానులు విరాట్‌పై ట్రోలింగ్‌కు దిగారు. ఈ ట్రోలింగ్‌పై స్పందించిన కోహ్లీ.. విమర్శకుల నోరు మూయించే ప్రయత్నం చేశాడు. ‘నేను వెజిటేరియన్‌ను అని ఎప్పుడూ చెప్పలేదు. ఎప్పటికే అలానే ఉంటానని కూడా అనలేదు. గట్టిగా గాలి పీల్చుకొని మీ కూరగాయాలు మీరు తినండి’అని ఫన్నీ ఏమోజీలతో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట హల్‌‌చల్ చేస్తోంది. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనకు సిద్దమవుతున్న కోహ్లీ.. ముంబై వేదికగా బీసీసీఐ ఏర్పాటు చేసిన బయో‌బబుల్‌లో క్వారంటైన్‌ పాటిస్తున్నాడు.

Related posts