telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ లో “జెర్సీ”

Jersey

గౌత‌మ్ తిన్న‌నూరి ద‌ర్శ‌క‌త్వంలో నాని న‌టించిన చిత్రం “జెర్సీ”. ఈ చిత్రానికి అశేష ప్రేక్ష‌కాద‌ర‌ణ ల‌భించింది. నాని క్రికెట‌ర్‌గా అద‌రగొట్టాడ‌ని సెలెబ్రిటీలు సైతం ప్రశంసల జల్లు కురిపించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రంలో శ్ర‌ద్ధా శ్రీనాథ్ కథానాయికగా న‌టించింది. జెర్సీ సినిమాలో నాని అర్జున్ అనే క్రికెటర్ పాత్రను పోషించాడు. 1996-97 రంజీట్రోఫీ క్రికెట్ నేపథ్యంలో ఈ చిత్ర కథ నడిచింది. విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న ఈ చిత్రాన్ని ఇప్పుడు బాలీవుడ్, కోలీవుడ్‌లో రీమేక్ చేస్తున్నారు. ఈ చిత్రం గతేడాది విడుదలై విమర్శల ప్రశంసలు అందుకున్న ఈ చిత్రం మరో ఘనత దక్కించుకుంది. ‘జెర్సీ’ చిత్రం ఓ అంతర్జాతీయ ఫిలిం ఫెస్టివల్ కు వెళుతోంది. నాని నటనా ప్రతిభకు నిదర్శనంగా నిలిచిన ఈ సినిమా ఇంటర్నేషనల్ ఇండియన్ టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో ప్రదర్శనకు ఎంపికైంది. ఈ అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఆగస్టు 9 నుంచి 15 వరకు జరగనుంది. ‘జెర్సీ’ చిత్రమే కాకుండా, ‘సూపర్ 30’, కార్తీ నటించిన ‘ఖైదీ’ (తమిళ్) కూడా టొరంటో ఫిలిం ఫెస్టివల్ లో సందడి చేయనున్నాయి.

Related posts