telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు సామాజిక

నా కోరికలు..

ఆకాశంలో నక్షత్రాలు
నా కోరికలు
నేనందుకోగలనా…!
నడిసంద్రంలో ఆణిముత్యాలు
నా ఆశలు
అవి నా దరి చేరునా…!!
పులి బారిన పడ్డ
లేడి వంటివి నా కష్టాలు
అవి నన్ను విడచునా…!!!
అని దిగులుపడుతూ కూర్చుంటే
నీవు దీనుడవేనోయ్…
రేకెట్లు తయారుచెయ్
నక్షత్రాలు నివే…
ఈత నేర్చుకో
ఆణిముత్యాలూ నీవే…
నీ మేధస్సుతో పరుగులు తియ్యి
ఈ కష్టాలు నీకొక లెక్కా…
వీటిని చేధించి సాధించినవాడే
మనిషికింద లెక్క…

Related posts