telugu navyamedia
ఆరోగ్యం ట్రెండింగ్ వార్తలు

వెన్న తింటే గుండె సమస్యలకు చెక్!

వెన్న… అంటే తెలియని వారుండరు. ఈ వెన్న వల్ల మనిషి ఆరోగ్యానికి మేలు చేస్తుందని కార్డియాజిస్టులు సెలవిస్తున్నారు. ఇటీవల లండన్‌కు చెందిన ప్రముఖ కార్డియాలజిస్టు ఏమన్నారంటే సంతృప్త కొవ్వులున్న ఆహార పదార్థాలు వాడకం తగ్గటం వల్లే గుండె జబ్బులు పెరుగుతున్నాయని! అలా సాచ్యురేటెడ్ కొవ్వు పదార్థాలున్న వెన్న వల్ల చాలా ఉపయోగాలే ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకోవచ్చు!మనదేశంలో పూర్వకాలం నుంచే పాల నుండి వెన్నను, వెన్న నుండి నెయ్యి, మీగడ తయారు చేయడం జరుగుతోంది. వెన్నెలో దాదాపు 25శాతం నీరే ఉంటుంది. నిజానికి వెన్న వల్ల కలిగే లాభాల ఏమిటో చాలా మందికి తెలియదు. వెన్నలో విటమిన్-ఎ, విటమిన్-డి, విటమిన్-ఇ, విటమిన్-కె2 ఎక్కువగా ఉంటాయి. అంతేకాదు బ్యుటిరేట్, కాంజుగేటెడ్, సీఎల్ఏ వంటి పోషకాలు ఉంటాయి.

ఈ పోషకాల్లోని బ్యుటిరేట్ ఎంతో ఉపయోగకరం.

ఇది మానసిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుంది. అంతేకాదు బ్యుటిరేట్ పోషకం మనకు ఒక శక్తి వనరు కూడా. మనం తిన్న ఆహారం చిన్న పేగుల నుంచి ఒంటికి పడుతుంది. ఇలా జరిగే క్రమంలో మనం తీసుకున్న ఆహారం ఏమాత్రం వృథా పోకుండా అంతా ఒంటికి పట్టేలా చేస్తుంది బ్యుటిరేట్. చిన్నపేగుల్లోని ఇన్‌ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది.సీల్ఏ(కాంజుగేటెడ్ లినోలిక్ యాసిడ్) గుండె ఆరోగ్యంగా ఉండటంలో తన వంతు పాత్ర పోషిస్తుంది. నిజానికి వెన్న తినడం వల్ల కొవ్వు పెరగడం, గుండె అనారోగ్యం పాలవుతందుని చాలామందిలో ఉన్న అపోహ. కానీ, ఏ వయసు వారైనా సరే పరిమితమైన వెన్న తీసుకుంటే ఆరోగ్యానికి వచ్చిన నష్టమేమీ లేదు. గుండెకు వచ్చిన సమస్యా ఏమీ లేదు. వెన్నలో యాంటీ ఆక్సిడెంట్స్, ఒమెగా-3, ఒమెగా-6, ఫ్యాటీ యాసిడ్సూ ఎక్కువే. ఇవి వ్యాధి నిరోధకశక్తి పెంచేందుకు, క్యాన్సర్ల నుంచి రక్షణ కల్పించేందుకు వెన్నలో అధికంగా ఉండే కాల్షియం, పాస్ఫరస్, విటమిన్-ఎ,డి ల శాతం రోగనిరోధక శక్తిని పెంచడానికి దోహదపడతాయి.

ఇన్ఫెక్షన్లు దూరం

100గ్రాముల వెన్నలో 750 కేలరీలు ఉంటాయి. వెన్నెలో యాంటీబ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. దీంతో ఇన్ఫెక్షన్ల నుంచి పరోక్ష రక్షణ పొందవచ్చు. రోజూ వెన్న తినే వారిలో జలుబు, ఫ్లూ జ్వరం వంటి లక్షణాలు చాలా అరుదు. జ్వరంతో బాధపడే వారు వెన్నతో కూడిన పదార్థాలు తింటే త్వరగా కోలుకుంటారట. ముఖ్యంగా పెరుగుతున్న పిల్లల మెదడు ఆరోగ్యంగా ఎదగాలంటే వెన్న ఎక్కువగా తినాలి. అది వారిలో చురుకుదనం పెంచుతుంది.

గుండెకు భరోసా

వెన్న, చీజ్, గడ్డ పెరుగు తినడం వల్ల గుండె సంబంధ వ్యాధులు వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ, అది నిజం కాదని లండన్ కార్డియాలజిస్టు ఒకాయన ప్రకటించాడు. హృద్రోగాల బారి నుంచి తప్పించుకోవడానికి సాచ్యురేటెడ్ కొవ్వులు అధికంగా ఉండే వెన్నలాంటి పదార్థాల వినియోగాన్ని తగ్గించుకోమని చెప్పడం తప్పు అని చెబుతూ ఆయన రాసిన వ్యాసాన్ని బ్రిటీష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఆ వ్యాసంలో సంతృప్త కొవ్వుల వాడకం తగ్గిపోవడమే హృద్రోగాలకు ఒక కారణం అని ఆయన వివరించారు.

వృద్ధులకు ఉపయోగం

గర్భవతులు నాలుగో నెల నుంచి వెన్న, నెయ్యి ఎక్కువగా తింటే శిశువు ఆరోగ్యంగా పెరుగుతుందని డాక్టర్లు సూచిస్తుంటారు. అంతేకాదు వెన్నలో క్యాన్సర్ నిరోధక లక్షణాలు ఉన్నాయని వైద్యరంగం ఎప్పటి నుంచో చెబుతోంది. నిద్రలేమి, లైంగిక సమస్యలు, మానసిక సమస్యలు, చెవి సమస్యలు, పక్క తడిపే అలవాటు ఉన్న వాళ్లకు వెన్న తినే అలవాటు వాటి నుంచి ఉపశమనం పొందవచ్చు. కీళ్ల నొప్పులతో బాధపడే వృద్ధులకు వెన్న మంచి ఔషధం. నెయ్యి తినే వారి కీళ్లలో జిగురు పెరిగి కీళ్ల నొప్పులు తగ్గుతాయి. వెన్నలోని విటమిన్-డి నరాల బలహీనతలను కూడా తగ్గిస్తుంది.

Related posts