కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఆ చిత్రం “కేజీఎఫ్”. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో యువ నటుడు యష్ హీరోగా నటించారు. ఈ చిత్రం కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో మంచి విజయం సాధించింది. దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ సాధించి అన్ని ఇండస్ట్రీలని షాక్‌కి గురి చేసింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ‘కేజీఎఫ్’ సినిమాకి ముందు చాలా మందికి యశ్ ఎవరో కూడా తెలియదు. కేవలం కన్నడ మార్కెట్ కే అతను పరిమితం. అయితే, ‘కేజీఎఫ్’ రాకింగ్ స్టార్ సత్తాను బాలీవుడ్ దాకా చాటింది. అందుకే, ‘కేజీఎఫ్ చాప్టర్ 2’లో సంజయ్ దత్, రవీనా టాండన్ లాంటి బీ-టౌన్ సీనియర్స్ ఉత్సాహంగా నటించారు. ‘కేజీఎఫ్ 2’ షూటింగ్ ని ఇప్పటికే యశ్ పూర్తి చేసేశాడు. ఆయన తన వంతు బాధ్యత అయిపోవటంతో నెక్ట్స్ మూవీపై దృష్టి పెట్టాడట. ప్రశాంత్ నీల్ తరువాత మరో యంగ్ కన్నడ డైరెక్టర్ కే ఈ సూపర్ స్టార్ ఛాన్స్ ఇచ్చాడని టాక్… ‘కేజీఎఫ్ చాప్టర్ 2’ తరువాత ఆ మూవీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రభాస్ తో సినిమా అనౌన్స్ చేశాడు. ‘సలార్’ ఇప్పటికే అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. మరి ‘కేజీఎఫ్’ తరువాత యశ్ పరిస్థితి ఏంటి? ఆయన తమ శాండల్ వుడ్ నుంచే మరో టాలెంటెడ్ డైరెక్టర్ ని ఎంచుకున్నాడని సమాచారం. ‘మఫ్టీ’ సినిమాతో బెంగళూరు సినీ సర్కిల్స్ లో మంచి బజ్ క్రియేట్ చేశాడు నర్తన్. అతనితోనే యశ్ నెక్ట్స్ చిత్రం ఉంటుందట. ఇప్పటికే డైరెక్టర్ నర్తన్ స్క్రిప్ట్ కూడా పూర్తి చేశాడని అంటున్నారు. అతి త్వరలో మూవీ గురించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రావచ్చు. చూడాలి మరి, కన్నడ సూపర్ హిట్ ‘మఫ్టీ’ మూవీ ఫేం… నర్తన్… ప్యాన్ ఇండియా స్టార్ యశ్ ని ఎలా హ్యాండిల్ చేస్తాడో!
previous post