చిన్ననాటి నేస్తమా
చిరకాలపు మిత్రమా
నాహ్రృదయం నీదెసుమా
నన్ను వీడిపోకుమా!
నాప్రేమ రూపమా
నాపాలి దీపమా
నాకన్నులలో నీవెసుమా
కనుసన్నలు దాటకుమా!
కరుణ స్వరూపమా
కడిగిన ముత్యమా
నాకవితా సుందరమా
మేలిమి బంగారమా
నాజీవిత గమనమా
గగనంలో కుసుమమా
నాజీవన రాగమా
నాభావన జీవనమా
నామనసున మందిరమా
మందార మరందమా
ఆనంద అర్ణవమా
అనురాగ హర్మ్యమా!
నాకవితా గానమా
ప్రాణంలో ప్రాణమా
నాపై కోపమా
నన్ను మరచి పోకుమా!
మిషన్ బిల్డ్ పేరిట రాష్ట్రాన్ని అమ్మకానికి పెడుతున్నారు: అనురాధ