telugu navyamedia
సినిమా వార్తలు

స‌మంత‌కు ర‌క్ష‌ణ‌గా నిల‌బ‌డ్డ బాలీవుడ్ హీరో..

నాగ‌చైత‌న్య‌తో విడాకులు అనంతరం స‌మంత జోరు పెంచారు. టాలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్ట్‌లకూ ఆమె పచ్చజెండా ఊపేస్తున్నారు. ఫ్యామిలీ మ్యాన్‌-2 వెబ్‌ సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది సమంత. సిరీస్‌ కూడా సూపర్‌ హిట్‌ కావడంతో సామ్‌ కు బాలీవుడ్‌లోనూ అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. 

Samantha Ruth Prabhu smiles as Varun Dhawan tells paparazzi 'kyun dara rahe  ho', carefully walks her to her car. Watch | Bollywood - Hindustan Times

ఇందులో భాగంగానే ఫ్యామిలీ మ్యాన్‌ సిరీస్‌ను తెరకెక్కించిన రాజ్‌ అండ్‌ డీకే దర్శకత్వంలోనే మరో వెబ్‌సిరీస్‌కు పచ్చ జెండా ఊపింది . స్పై థ్రిల్లర్‌ యాక్షన్‌ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్‌లో బాలీవుడ్‌ హీరో వ‌రుణ్ ధావ‌న్ హీరోగా న‌టిస్తున్నారు. దీంతో వరుణ్‌ ధావన్‌, సమంత తొలిసారి స్క్రీన్‌ షేర్‌ చేసుకోనున్నారు.

Samantha Varun Dhawan

ప్రస్తుతం ఈ వెబ్‌ సిరీస్‌కు సంబంధించి ప్రి ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. కాగా సిరీస్‌కు సంబంధించి ముంబయిలో ఉన్న ప్రాజెక్ట్‌ టీం దర్శకులు రాజ్‌ అండ్‌ డీకేలను గత రాత్రి ఆమె ఇటీవలే కలిశారు. ఆనంత‌రం బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా ఫొటోల కోసం ఫొటోగ్రాఫర్లు, అభిమానులు చుట్టుముట్టుడం వల్ల ఈ మేరకు సామ్​ భయపడిపోయింది.

Samantha Varun Dhawan

ఇదే సమయంలో అక్కడకు వచ్చిన వరుణ్‌ ధావన్‌ సామ్‌ కు రక్షణగా నిలబడ్డాడు. సమంత భయపడుతోంది.. ఎందుకు అలా ఆమెను భయపెడతున్నారు? భయపెట్టకండి’ అంటూ సరదాగా  మీడియాను అడిగారు ​. అనంతరం సామ్‌ను సేఫ్‌గా కారు వ‌ర‌కు వరుణ్ తీసుకెళ్లారు. కాగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Related posts