telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు

అతి పిన్న వయస్సు మేయర్‌గా బీఎస్సీ విద్యార్థిని రికార్డు…

తాజాగా కేరళలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారు.. ఈ ఎన్నికల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్‌డీఎఫ్‌ కూటమి మెజార్టీ స్థానాలను కైవసం చేసుకుంది.. ఎంత తప్పుడు ప్రచారం చేసినా.. మరోసారి కేరళలో సీపీఎం నేతృతంలోని ఎల్‌డీఎఫ్‌ కూటమి సత్తాచాటింది. ప్రతిపక్షంలోనూ ఉన్న యూడీఎఫ్‌ కూటమి రెండోస్థానంలో నిలవడగా.. ఎన్డీఏ అంచనాలు వేసిన స్థాయిలో ప్రభావాన్ని చూపలేకపోయింది. ఇక, తిరువనంతపురం.. భారత దేశంలోనే 100 శాతం అక్షరాస్యత నమోదు చేసిన ప్రాంతంగా రికార్డు సృష్టించింది.. ఆ నగరానికి ఇప్పుడు 21 ఏళ్ల బీఎస్సీ విద్యార్థిని ఆర్య రాజేంద్రన్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఆమె కేరళలో అతి పిన్న వయస్సు మేయర్‌గా రికార్డు కెక్కబోతున్నారు.  ఈ ఎన్నికల్లో ముదవణ్ముగల్ వార్డు నుంచి సీపీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆర్య.. యూడీఎఫ్‌ అభ్యర్థిపై 2,872 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.. తిరువనంతపురంలో ఆల్ సెయింట్స్ కాలేజీలో ప్రస్తుతం బీఎస్సీ మ్యాథ్స్ రెండవ సంవత్సరం విద్యార్థిని.. ఆర్య, బాల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు సీపీఎం విద్యార్థి విభాగమైన ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఆఫీస్ బేరర్‌ కూడా.. ఆమె ఎలక్ట్రీషియన్ రాజేంద్రన్ మరియు ఎల్ఐసి ఏజెంట్ శ్రీలత కుమార్తె. ఇక, ఎన్నికల ఫలితాల తర్వాత ఇవాళ సమావేశమైన సిపిఎం జిల్లా కార్యదర్శవర్గం.. ఏకగ్రీవంగా తిరువనంతపురం మేయర్‌గా ఆర్య రాజేంద్రన్ పేరు ఖరారు చేసింది.. మరో ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు మేయర్‌ రేస్‌లో ఉన్నా.. 21 ఏళ్ల ఆర్య వైపే మొగ్గు చూపింది సీపీఎం. మేయర్‌గా తన పేరును ఖరారు చేయడంపై స్పందించిన ఆర్య.. ఈ పదవికి సంబంధించి పార్టీ నుండి ఇంతవరకు తనకు ఎలాంటి సమాచారం రాలేదని, తనకు ఇచ్చిన ఏ బాధ్యతను అయినా సంతోషంగా స్వీకరిస్తానని ఈ సందర్భంగా వెల్లడించింది.. నేను ప్రస్తుతం కౌన్సిలర్‌గా పనిచేస్తున్నాను.. కానీ, పార్టీ నాకు ఇచ్చిన బాధ్యతలను కష్టమైనా నిర్వహిస్తానని ప్రకటించారు. మహిళల సమస్యలు మరియు ఇతర అభివృద్ధి కార్యకలాపాలను పరిష్కరించడంపై తాను ప్రధానంగా దృష్టి సారించనున్నట్టు తెలిపారు.

Related posts