telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

డా.జి.బి.రామకృష్ణ శాస్త్రి కన్నుమూత

GBR

రంగస్థల ఆణిముత్యం డా.జి.బి.రామకృష్ణ శాస్త్రి నిన్న హైదరాబాదులో కన్నుమూశారు. మచిలీపట్నం, విశాఖపట్నం, హైదరాబాద్ కేంద్రాలుగా ఆయన నాటక ప్రస్థానం సాగింది. వందలాది నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ఎన్నో గౌరవాలు, పురస్కారాలు, బహుమతులు అందుకున్నారు. ఇటీవల వరకు అధ్యాపకులుగా కొనసాగారు. ఈ విషయం తెలుసుకున్న ప్రముఖులు డా జి.బి.రామకృష్ణశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని భగవంతున్ని ప్రార్ధిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. రామకృష్ణ శాస్త్రికి యువ కళా వాహిని కళాకారులు, డా అక్కినేని నాగేశ్వరరావు నాటక కళా పరిషత్తు, గురు ప్రసాద్ కల్చరల్ ఫౌండేషన్ సంస్థలు ఘన నివాళులు అర్పించారు.

Related posts