telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

అరే కేఏ పాలు ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు…. వర్మ ట్వీట్

varma

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గత కొన్ని రోజులుగా కరోనా వైరస్‌కు సంబంధించి రకరకాల ట్వీట్లు పెడుతున్నారు. ఈసారి కేఏ పాల్‌ను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. ‘ అరే కేఏ పాలు ఈ సుత్తి సలహాలు ఇచ్చే బదులు నీ దేవునితో చెప్పి కరోనాని తీసేయమని చెప్పొచ్చు కదరా సుబ్బరావు నీకు నిజంగా దేవుడి దగ్గర అంత సీన్ ఉంటే నేను తిట్టిన తిట్లకు నాకు కరోనా వచ్చినట్లు చేయి యంకమ్మ’ అని కేఏ పాల్ ‌పై సెటైర్లు వేస్తూ రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశారు. వర్మ కరోనా ఎఫెక్ట్‌తో అమెరికాలో మార్ట్స్ వద్ద సరుకుల కోసం అమెరికన్ల క్యూలైన్లకు సంబంధించిన వీడియోను పోస్టు చేశారు. ఈ క్యూలైన్లు బాహుబలి టికెట్ల క్యూలైన్ల కోసం వేచి ఉన్న రికార్డుల్ని బీట్ చేశాయని వర్మ పోస్టు చేశారు. భగవంతుడు, కరోనా వైరస్ మధ్య సీక్రేట్ సంబంధం కొనసాగుతుందని వాళ్ల లవ్ స్టోరీలో మనమే విలన్స్ అంటూ వర్మ మరో ట్వీట్ చేశారు. ఇప్పుడు ఏ మతం కూడా మనల్ని కరోనా మతం నుంచి కాపాడలేదని మరో పోస్టు పెట్టారు. దేవుడు పాపుల్ని శిక్షించేందుకే ఇలాంటి వైరస్ తీసుకొచ్చినప్పుడు దాని నిర్మూలనకు మనం వ్యతిరేకంగా పనిచేయడం భగవంతుడికి వ్యతిరేకంగా పనిచేయడమే కదా అని మరో ట్వీట్ చేశారు వర్మ.

Related posts