telugu navyamedia
రాజకీయ వార్తలు సామాజిక

చైనీస్ వైర‌స్ అంటూ ట్రంప్ వ్యాఖ్యలు .. డ‌బ్ల్యూహెచ్‌వో సీరియ‌స్

అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ త‌న ప్ర‌తి ట్వీట్‌లో అది చైనీస్ వైర‌స్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. దీన్ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ సీరియ‌స్ గా తీసుకుంది. అలా అనడం  స‌రికాద‌న్న‌ది. క‌రోనా గురించి మాట్లాడేట‌ప్పుడు జాగ్ర‌త్త‌గా ప‌దాల‌ను వాడాలి. అనుచితంగా నోరు పారేసుకోవ‌డం స‌రికాదు. వైర‌స్ పేరుతో ఒక‌ర్ని వెక్కిరించ‌డం కూడా అభ్యంత‌ర‌క‌ర‌మే. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ఎగ్జిక్యూటివ్ డైర‌క్ట‌ర్ మైక్ ర్యాన్ ఈ విష‌యాల‌ను తెలిపారు.

2009లో హెచ్‌1ఎన్‌1 వైర‌స్ నార్త్ అమెరికాలో ప్రారంభ‌మైంద‌ని, కానీ అప్పుడు ఎవ‌రూ అమెరిక‌న్ ఫ్లూ అంటూ ఆ ప్రాంతం పేరుతో వైర‌స్‌ను పిలువ‌లేద‌ని ర్యాన్ అన్నారు. ఇత‌ర వైర‌స్‌ల విష‌యంలో ఇదే త‌ర‌హా ప‌ద్ధ‌తి అవ‌లంబించాల‌న్నారు. ఓ ప్రాంతంతో వైర‌స్‌ను పోల్చ‌డం ఆపేయాల‌న్నారు. వైర‌స్‌పై ప్ర‌పంచ దేశాలు అన్నీ క‌లిసిక‌ట్టుగా పోరాటం చేయాల‌ని ర్యాన్ పిలుపునిచ్చారు.

Related posts