telugu navyamedia
క్రీడలు వార్తలు సామాజిక

కోహ్లీ వైఫల్యంపై కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు

India Pakistan Cricket Kapildev

న్యూజిలాండ్ టూర్ లో టీమిండియా ఘోర వైఫల్యం చెందింది. ముఖ్యంగా కెప్టెన్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ లో ఎన్నడూ లేని విధంగా వైఫల్యం చెందాడు. రెండు టెస్టుల్లో నాలుగు ఇన్నింగ్స్ లలో కోహ్లీ కేవలం 38 పరుగులు మాత్రమే చేశాడు. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ఒక వయసు వచ్చిన తర్వాత కంటిచూపు, శరీరం స్పందించే తీరు నెమ్మదిస్తాయని ఆయన అన్నారు. నీవు ఒక వయసుకు చేరుకున్న తర్వాత… ముఖ్యంగా 30 ఏళ్లు దాటిన తర్వాత నీ కంటి చూపులో తేడా వస్తుంది. వాస్తవానికి ఇన్ స్వింగర్ డెలివరీలను కోహ్లీ బౌండరీలకు తరలిస్తుంటాడు. అదే అతని బలం. కానీ ఇప్పుడు అదే విషయంలో ఇబ్బంది పడుతున్నాడు. అందుకే కోహ్లీ తన కంటి చూపుపై కేర్ తీసుకోవాలి. ఒక గొప్ప బ్యాట్స్ మెన్ ఎవరైనా సరే ఇన్ కమింగ్ డెలివరీకి బౌల్డ్ కావడమో లేదా ఎల్బీడబ్లూ కావడమో జరుగుతోందంటే… అతను మరింత ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Related posts