telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

భారత్ తో .. సక్యతే పాక్ కు మంచిది .. ఇమ్రాన్ కు హితవు పలికిన దలైలామా..

dalailama on pakistan primeminister imran

భారత్, పాకిస్థాన్ సంబంధాలపై టిబెట్ బౌద్ధ మత గురువు దలైలామా స్పందించారు. ఉపఖండంలో శాంతి కోసం పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తన దృక్పథం మార్చుకోవాల్సి ఉంటుందని సూచించారు. వాస్తవిక దృష్టితో ఆలోచించడం అలవర్చుకోవాలని సలహా ఇచ్చారు. ప్రతి అంశాన్ని భావోద్వేగాలతో ముడిపెట్టడం పాక్ ప్రధాని సహా ఇతర వేర్పాటు వాదులు మానుకోవాలని హితవు పలికారు. ఐక్యరాజ్యసమితిలో భారత, పాకిస్థాన్ ప్రధానుల ప్రసంగాల్లో ఓ తేడా ఉంది. భారత ప్రధాని శాంతి గురించి మాట్లాడితే, అందుకు భిన్నంగా పాక్ ప్రధాని ఏం మాట్లాడారో అందరికీ తెలుసు. చైనా ప్రాపకం సంపాదించాలన్నదే పాక్ ఉద్దేశం.

పాకిస్థాన్ కు భారత్ తోనూ అవసరం ఉంది. అందుకే పాక్ నేతలు సంయమనం పాటించాలి. ముఖ్యంగా పాక్ ప్రధాని భావోద్వేగాలు నియంత్రించుకుని మాట్లాడాలిఁ అని వ్యాఖ్యానించారు. పాక్ ప్రధాని మాత్రమే కాదని, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా మితిమీరిన భావోద్వేగాలు ప్రదర్శిస్తుంటాడని దలైలామా విమర్శించారు. సిరియా విషయంలోనే చూడండి! అమెరికా అధ్యక్షుడు అతిగా ఆవేశపడి సిరియా నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నారు. ఆ అవకాశాన్ని టర్కీ అధ్యక్షుడు చక్కగా ఉపయోగించుకున్నాడు. ఇది చాలా బాధాకరం అని దలైలామా పేర్కొన్నారు.

Related posts