తెలంగాణలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభమైనాయి. కరోనా మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో విద్యార్థులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ సూచనలకు అనుగుణంగా విద్యార్థులు తగిన జాగ్రత్తలు పాటిస్తూ పరీక్షా కేంద్రానికి హాజరయ్యారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు విద్యార్థులు మాస్కులు ధరించి పరీక్షలకు హాజరయ్యారు.
పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు శానిటైజర్లు, నీళ్ల బాటిల్స్ అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం ఇప్పటికే విద్యాశాఖకు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సెంటర్ల వద్ద మాస్కులతో విద్యార్థులు దర్శనమిస్తున్నారు. విద్యార్థులకు దగ్గరుండి వారి తల్లిదండ్రులు మాస్కులు కట్టి పరీక్షా కేంద్రాలకు పంపిస్తున్నారు.
కాంగ్రెస్ బాగుపడాలంటే ఉత్తమ్ తప్పుకోవాలి: రాజగోపాల్రెడ్డి