తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2.7 లక్షలు దాటాయి కరోనా కేసులు. అయితే… ఇవాళ రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం..అయితే తాజా బులెటిన్ ప్రకారం కొత్తగా రాష్ట్రంలో 491 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,599 చేరింది. ఇందులో 2,69,828 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 7,272 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. తాజా బులెటిన్ ప్రకారం తాజాగా కరోనాతో ముగ్గురు మృతి చెందారు. దీంతో తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా మరణాల సంఖ్య 1499 కి చేరింది. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 1.5 శాతంగా ఉంటే.. రాష్ట్రంలో 0.53 శాతానికి పడిపోయిందని.. రికవరీ రేటు దేశంలో 96.85 శాతంగా ఉంటే.. స్టేట్‌లో 95.1 శాతానికి పెరిగిందని బులెటిన్‌లో పేర్కొంది సర్కార్. ఇక తాజా బులెటిన్ ప్రకారం నిన్న ఒక్కరోజు 596 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. నిన్న తెలంగాణాలో 48,005 పరీక్షలు చేయగా ఇప్పటి దాకా 62,05,688 పరీక్షలు జరిగాయి.
next post
కోడెల గుండెపోటుకు ప్రభుత్వ ఒత్తిళ్లే కారణం: నక్కా ఆనందబాబు