telugu navyamedia
క్రీడలు వార్తలు

మహిళాల ప్రపంచ కప్ షెడ్యూల్ విడుదల…

ప్రపంచాన్ని కరోనా ఏ విధంగా వణికిస్తుందో అందరికి తెలిసిందే. అయితే ఈ ఏడాది కరోనా క్రికెట్ ప్రపంచానికి చాల నష్టం కలిగించింది. ఈ వైరస్ కారణంగా పదుల సంఖ్యలో ద్వైపాక్షిక సిరీస్లు వాయిదా పడ్డాయి. అలాగే ముఖ్యమైన ఆసియా కప్, ఐసీసీ టీ 20 ప్రపంచ కప్ టోర్నమెంట్లతో పాటుగా వచ్చే ఏడాది జరగాల్సిన మహిళల వన్డే ప్రపంచ కప్ ను కూడా ఐసీసీ 2022 కి వాయిదా వేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు 2022 లో జరిగే మహిళల వన్డే ప్రపంచ కప్ ప్రపంచ కప్ షెడ్యూల్ వచ్చేసింది. న్యూజిలాండ్ వేదికగా 2022 మార్చి 4 న ఈ టోర్నీ ప్రారంభం అవుతుంది. అందులో భారత జట్టు మార్చి 6 న తన మొదటి మ్యాచ్ ఆడుతుంది. అయితే మొత్తం 8 జట్లు పాల్గొనే ఈ టోర్నీకి ఇప్పటివరకు ”భారత్, న్యూజిలాండ్  ఆస్ట్రేలియా , ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా” 5 జట్లు మాత్రమే అర్హత సాధించాయి. ఇక మిగిలిన మూడు స్థానాలకు పోటీ పడుతున్న 10 జట్లు శ్రీలంక వేదికగా జరగనున్న ఐసీసీ ఉమెన్స్ క్రికెట్ ప్రపంచ కప్ క్వాలిఫైయర్ మ్యాచ్ లు ఆడవలసి ఉంది. మరి ఈ మ్యాచ్ లు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది అనేది ఐసీసీ ఇంకా ప్రకటించలేదు. చూడాలి మరి ఏ జట్లు ఆ మూడు స్థానాలు ఆక్రమిస్తాయి అనేది.

Related posts