గత కొద్దిరోజులుగా దేశం ఆర్థిక మాంద్యం లోకి వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. తదనుగుణంగానే ఒక్కో సంస్థపై సదరు యజమాన్యం పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఇటీవల తెలంగాణ ఆర్టీసీలో తలెత్తిన సంక్షోభాన్ని ఎదుర్కునేందుకు ప్రభుత్వం చార్జీల పెంపుతో పరిష్కారం చూపించే నిర్ణయం తీసుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రైలు ఛార్జీలు కూడా పెంచనున్నట్లుగా తెలుస్తోంది. మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్ల చార్జీలు 5 శాతం నుండి 10 శాతం వరకు పెంచవచ్చని రైల్వే వర్గాల సమాచారం.
ప్రస్తుతం పార్లమెంటు శీతాకాల సమావేశాలు జరుగుతున్నందున్న చార్జీల నిర్ణయం వాయిదా వేసుకున్నట్లుగా తెలుస్తోంది. మోదీ సర్కారు వచ్చిన తర్వాత తొలిసారి 2014 జూన్ 25న చార్జీలు పెంచారు. అప్పట్లో ప్ర యాణికుల చార్జీలు 14.2 శాతం పెరగగా.. రవాణా చార్జీలను 6.5 శాతానికి పెంచారు. ఇప్పుడు పెంచితే ఐదున్నరేళ్లలో పెంపు రెండో సారి అవుతుంది. కాకపోతే, చార్జీల పెంపు మరీ ఎక్కువ లేకపోవడం కాస్త ఊరటగానే చెప్పవచ్చంటున్నారు విశ్లేషకులు.
అసెంబ్లీ, సెక్రటేరియట్ నిర్మాణాలపై లోక్ సభలో ప్రస్తావిస్తా: ఉత్తమ్