telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఢిల్లీ సీఎం చేసిన పనిని తప్పుబట్టిన మోడీ…

దేశ ప్రధాని మోడీతో ఈ రోజు ఉదయం జరిగిన సమావేశంలో కేజ్రీవాల్‌ ఆక్సిజన్ కొరతను ప్రధాని దృష్టికి తీసుకువచ్చారు. ఇదే సమయంలో ఇదంతా లైవ్ టెలీ కాస్ట్ అవుతుందన్న అంశం తెలుసుకున్న మోడీ ఇది మన సంప్రదాయానికి, నిబంధనలకు పూర్తిగా విరుద్ధం. అంతర్గత సమావేశాన్ని ఒక సీఎం ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. ఇది సముచితం కాదు. మనం సంయమనం పాటించాలి’ అంటూ వ్యతిరేకించారు. దీంతో ఢిల్లీ ముఖ్యమంత్రి స్పందిస్తూ.. ప్రధానిని క్షమించమని కోరారు. జాగ్రత్తగా ఉంటామని తెలిపారు. ఆ తర్వాత కేజ్రీవాల్ తాను మాట్లాడుతున్న అంశాన్ని కొనసాగించారు. ఇలా ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయడంపై కేంద్ర ప్రభుత్వ వర్గాలు కేజ్రీవాల్‌ను తప్పుపట్టాయి. అయితే ‘ఈ సమావేశాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయకూడదని మాకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో మేం ఈ నిర్ణయం తీసుకున్నామని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ప్రకటన వెలువడింది.

Related posts