telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు: ఉత్తమ్

uttam congress mp

పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి బీజేపీ పై విమర్శలు గుప్పించారు. నల్గొండ జిల్లా దేవరకొండలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదని విమర్శించారు.

తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ బలపడలేదనిఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ పార్టీయేనని ఉత్తమ్ పేర్కొన్నారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని ఉత్తమ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు జానారెడ్డి, బాలూ నాయక్, కాంగ్రెస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Related posts