telugu navyamedia
సినిమా వార్తలు

చవకరకం పబ్లిసిటీ… రంగోలీపై ట్రోలింగ్

Kangana

సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ సోదరి రంగోలి చేసే హంగామా అంతా ఇంతా కాదు. గతకొంతకాలంగా ట్వీట్స్ ద్వారా బాలీవుడ్ ప్రముఖులపై విమర్శలు గుప్పిస్తూ వార్తలో నిలిచింది రంగోలి. కంగనా సోదరి, ఆమె పర్సనల్ మేనేజర్ అయిన రంగోలీ సోషల్ మీడియాలో తన చెల్లెలు గురించి పబ్లిసిటీ చేస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె కంగనాకి సంబంధించి ఓ పోస్ట్ పెట్టింది. అయితే దాన్ని కాస్త నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. “ఈ చీరను కంగన కోల్‌కతాలో రూ.600కు కొన్నది. అంత తక్కువకే ఇంత మంచి చీరలు దొరుకుతాయని తెలిసి తను చాలా ఆశ్చర్యపోయింది. అయితే ఈ చీరలను నేసేవారు అంత తక్కువ సంపాదన కోసం ఎంత శ్రమిస్తారో అర్థమై తను చాలా బాధపడింది” అని ట్వీట్ చేసి కంగన సింప్లిసిటీ గురించి పరోక్షంగా వెల్లడించే ప్రయత్నం చేసింది ఆమె సోదరి రంగోలి. రంగోలి చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ట్రోలింగ్‌కు గురవుతోంది. “చీర సంగతి సరే.. కంగన ధరించిన బ్యాగ్ ధర, చెప్పుల ధర, గ్లాసెస్ ధర చెప్పమ`ని ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. `ఆమె ధరించిన చీర ధర ఆరువందలే. కానీ, ఆమె బ్యాగ్ ధర 3 లక్షల రూపాయలుంటుంది. గ్లాసెస్, చెప్పుల ధర కూడా లక్షల్లోనే ఉంటుంద`ని మరొకరు ట్వీట్ చేశారు. “చవకరకం చీరతో భారీ పబ్లిసిటీ చేశాననుకుంటున్నారా?” అని ఇంకకొరు కామెంట్ చేశారు. అయితే రంగోలి అనుకున్నది ఒకటైతే… అయినది మరొకటి.

Related posts