telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

నన్ను హత్య చేయాలనుకున్నారు… హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు

Shilpa-Anand

హీరోయిన్ సాక్షి శివానంద్ చెల్లెలు, ఒకప్పటి టాలీవుడ్ హీరోయిన్ శిల్పా ఆనంద్ మోడల్‌గా జీవితాన్ని ప్రారంభించిన శిల్పా ఆనంద్ పలు దక్షిణాది, బాలీవుడ్ సినిమాల్లో నటించింది. 2003లో వచ్చిన మంచు విష్ణు తొలి సినిమా ‘విష్ణు’తో శిల్పా ఆనంద్ గుర్తింపు తెచ్చుకుంది. 2007లో వచ్చిన ‘దిల్ మిల్ గయా’ టీవీ షోతో ప్రేక్షకులకు బాగా చేరువైంది. 2014 వరకు టీవీ, సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ప్రస్తుత నటనకు దూరంగా ఉంటుంది. తన పేరును 2015లో ఓహన్నా ఆనంద్‌గా మార్చుకుంది. తాజాగా ఆమె చేసిన ఫేస్‌బుక్ పోస్ట్ సంచలనం సృష్టిస్తోంది. ఈ నెల 18నాటి పోస్టులో వ్యక్తిగత జీవితంలో తాను ఎదుర్కొంటున్న సమస్యలను ఫేస్ బుక్ వేదికగా ఆమె పంచుకుంది. ఆ పోస్ట్ లో తనను, తన తల్లిని హత్య చేయడానికి తన సోదరి సాక్షి శివానంద్ అత్త ‘భావన బ్రహ్మభట్’ ప్రయత్నిస్తోందంటూ తీవ్ర ఆరోపణలు చేసింది. ఇన్సురెన్స్ డబ్బుల కోసం భావన తన భర్తను సైతం హత్య చేసిందని.. ఈ విషయమై తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని తెలిపింది. హత్య అనంతరం భావన అమెరికా వెళ్లిపోయిందని పేర్కొంది. ఈ కేసులో తన తల్లిని పోలీసులు చాలా సార్లు ప్రశ్నించారని తెలిపింది. భావన కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని.. భారత్‌కు వస్తే అరెస్ట్ ఖాయమని చెప్పింది. త్వరలోనే మరిన్ని విషయాలు పంచుకుంటానని తెలిపింది. అయితే ప్రస్తుతం ఆ పోస్టులను ఆమె డిలీట్ చేసింది.

Related posts