telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆ అవకాశానికి నో చెప్పిన రాములమ్మ..!

విజయశాంతి ఈ పేరు తెలుగు నాట అందరికీ సుపరిచితమే. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, విజయశాంతి జోడీ అంటే సినిమా హిట్ అనే టాక్ నడిచింది. దీన్ని నిజం చేస్తూ వీరు జోడీగా చేసిన సినిమాలు బాక్సాఫీస్‌ను బద్దలు కొట్టాయి. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల వీరు కలిసి నటించడం ఆపేశారు. వారి మధ్య విబేధాలే అందుకు కారణమని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఆ తరువాత విజయశాంతి రాజకీయ అరంగేట్రం చేశారు. అప్పటి నుంచి మరే సినిమాలోనూ ఆమె కనిపించలేదు. అయితే ఈ ఏడాది మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ విజయశాంతి వెండితెరపై కనపించారు. ఈ సినిమా భారీ హిట్ అందుకోవడంతో అమె వద్దకు వరుస అవకాశాలు వెళ్లాయి. కానీ అన్నింటినీ ఆమె తిరస్కరించారు. సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత చాలా మంది ఆఫర్లతో తనను సంప్రదించారని, కానీ వారికి నో చెప్పానని, చివరికి చిరంజీవి సినిమాలో ఓ కీలక పాత్ర ఉందని కూడా తన వద్దకు వచ్చారని కానీ తనకు ఆసక్తి లేకపోవడంతో వారిని వెనక్కు పంపానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో విజయశాంతి తెలిపారు. అభిమానులను తనను ఇంకా వెండి తెరపై చూడాలని అనుకున్నప్పటికీ తాను మాత్రం ప్రజా సేవ చేయదలచుకున్నట్లు తెలిపారు. సినిమాలు చేస్తే రాజకీయపరంగా తనకు ఇబ్బందులు ఎదురవుతాయని అందుకే సినిమాలకు దూరమయ్యానని ఆమె చెప్పారు.

Related posts