telugu navyamedia
సినిమా వార్తలు

‘ఆర్​ఆర్​ఆర్’ నుంచి మ‌రో సాంగ్ ప్రోమో..

మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్​చరణ్, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్​ హీరోలుగా దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్​ చిత్రం ‘ఆర్ఆర్​ఆర్​( “రౌద్రం రణం రుధిరం”). అల్లూరి సీతారామరాజుగా చరణ్, కొమరం భీమ్​గా ఎన్టీఆర్ నటించిన ఈ చిత్రం.. జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్ర‌మంలో ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు చిత్ర యూనిట్.

RRR Movie 4th Single: Roar Of Bheem Song Promo Released | RRR Movie 4th  Single: RRR నుంచి మరో సర్ ప్రైజ్- 'రోర్ ఆఫ్ భీమ్' సాంగ్ ప్రోమో రిలీజ్ |  వినోదం News in Telugu

ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన పాట‌లు, పోస్ట‌ర్‌, వీడియోలు అంద‌రి విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. తాజాగా కొమురం భీమ్ గా నటించిన ఎన్టీఆర్ పాత్రకి సంబంధించి 4వ పాట ప్రోమోను విడుదల చేశారు. కొమురం భీముడో’ అంటూ సాగే ఈ పాట డిసెంబర్​ 24న విడుదలకానుంది.

What Does The Hindi Audience Think About RRR Trailer?

ఈ పాటను కాల భైరవ పాడగా, ఆయన తండ్రి, సంగీత స్వరకర్త ఎంఎం కీరవాణి సినిమాకు సంగీతం అందించారు. ఇందులో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా న‌టించగా. అజయ్ దేవ్​గణ్ కీలకపాత్ర పోషించారు. డీవీవీ దానయ్య రూ.450 కోట్లతో ఈ సినిమాను నిర్మించారు.

Related posts