telugu navyamedia
సినిమా వార్తలు

“వారికే ఓటేయండి” సింగర్ స్మిత స్పెషల్ వీడియో

Singar-Smitha

ప్రముఖ సింగర్ స్మిత తాజాగా ఓటర్లను ఉద్దేశిస్తూ చేసిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఎన్నికల నేపథ్యంలో రూపొందిన ఈ వీడియోలో “నా పేరు ఆంధ్రా… నా వయసు ఐదేళ్లు” అంటూ స్మితా కూతురు శివి నటించింది. అయితే ఈ వీడియోలో స్మిత ఏ పార్టీ ప్రస్తావన తీసుకురాకుండానే తానేం చెప్పాలనుకుందో చెప్పేసింది. అనుభవం ఉన్న నాయకుడు ఉంటేనే అమరావతి రాజధాని నిర్మాణం పూర్తవుతుందని, ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని స్మిత ఈ వీడియోలో చెప్పడం చూస్తుంటే పరోక్షంగా అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడుకే సపోర్ట్ చేస్తున్నట్లుగా అర్థం అవుతోంది. గతంలో 2014 ఎన్నికల సమయంలో ప్రస్తుత ప్రధాని మోదీకి మద్దతుగా ఓ ఆల్బం విడుదల చేసింది స్మిత.

Related posts