telugu navyamedia
సినిమా వార్తలు

రాజమౌళి అమెరికా వెళ్ళింది అందుకేనా ?

Rajamouli

దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో భారీ బ‌డ్జెట్‌తో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న టాలీవుడ్ మోస్ట్ ప్రెస్టీయ‌స్ ప్రాజెక్ట్ “ఆర్ఆర్ఆర్”. హై టెక్నిక‌ల్ వేల్యూస్ తెరకెక్కుతున్న చిత్ర‌మిది. అలియా భ‌ట్‌, సముద్ర ఖని, అజ‌య్ దేవ‌గణ్ కీల‌క పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ పాత్ర‌లో, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా న‌టిస్తున్నారు. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ బేన‌ర్‌పై దాన‌య్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా షూటింగ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి ఇటీవ‌ల అమెరికా వెళ్లిన సంగ‌తి తెలిసిందే. తానా స‌భ‌ల్లో పాల్గొన‌డానికే రాజ‌మౌళి అమెరికా వెళ్తున్నార‌ని అప్ప‌ట్లో వార్త‌లు వ‌చ్చాయి. ఆ వార్త‌ల‌ను వెంట‌నే రాజ‌మౌళి ఖండించారు. అయితే రాజ‌మౌళి అమెరికా వెళ్లింది “ఆర్ఆర్ఆర్” సినిమా ప‌ని మీదేన‌ట‌. “ఆర్ఆర్ఆర్”లో రామ్‌చ‌ర‌ణ్ స‌ర‌స‌న ఆలియా భ‌ట్‌ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా.. ఎన్టీయార్ ప‌క్క‌న క‌థానాయిక ఇంకా ఫిక్స‌వ‌లేదు. కథ రీత్యా ఆ పాత్రలో ఇంగ్లీష్ భామ న‌టించాల్సి ఉండ‌డంతో గ‌తంలో బ్రిట‌న్‌ నటి డైసీ ఎడ్గర్‌ జోన్స్‌ని ఎంపిక చేశారు. అయితే ఆమె వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో సినిమా నుంచి త‌ప్పుకుంది. దీంతో మ‌ళ్లీ హీరోయిన్ల వేట మొద‌లైంది. చివ‌ర‌కు హాలీవుడ్ భామ ఎమ్మా రాబ‌ర్ట్స్‌ని రాజ‌మౌళి ఖ‌రారు చేసిన‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి. ఎమ్మా రాబ‌ర్ట్స్‌కి క‌థ వినిపించేందుకే రాజ‌మౌళి అమెరికా వెళ్లారని, అమెకు క‌థ న‌చ్చ‌డంతో సినిమాలో న‌టించేందుకు అంగీక‌రించింద‌ని స‌మాచారం. అయితే ఎమ్మా గురించి చిత్ర‌బృందం ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు.

Related posts