గోవాలో సినీ నటుడు మిలింద్ సోమన్ ఏకంగా దుస్తులన్నీ ఊడదీసుకొని నగ్నంగా పరుగు పెడుతూ ఫోటోలకు ఫోజులిచ్చారు. తన పుట్టిన రోజు సందర్భంగా భార్యతో కలిసి గోవా వెళ్లిన ఆయన ఇలా న్యూడ్ ఫోటోలు దిగి వాటిని ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. దీంతో మిలింద్ సోమన్ వ్యవహారంపై వ్యతిరేకత వచ్చింది. గోవా సురక్షా మంచ్ సభ్యులు మిలింద్ సోమన్‌పై చేసిన ఫిర్యాదు మేరకు గోవా పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారు. పబ్లిక్‌గా ఇలా హద్దులు దాటి నగ్న ప్రదర్శన చేయడం నేరమని.. అసభ్యత, అశ్లీలత అంశాల కింద మిలింద్‌పై సౌత్ గోవా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనకు మద్దతును ఇస్తూ నటి పూజా బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నగ్నత్వం నేరమైతే, ముందు నాగ బాబాలను అరెస్ట్ చేయండి అని ఆమె అన్నారు. దీనిపై ఓ పోస్ట్ చేసిన పూజా బేడీ.. మిలింద్ సోమన్ అందమైన ఫొటోలో ఎలాంటి అసభ్యత లేదు. అసభ్యత అన్నది చూసే వాడి దృష్టిని బట్టి, ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. నగ్నత్వం అన్నది నేరమైతే నాగబాబాలు అందరినీ అరెస్ట్ చేయాల్సిందే. ఒంటికి బూడిద రాసుకుంటే వారిని ఒప్పుకుంటారా..! అని కామెంట్ పెట్టారు.
A bsolutely nothing obscene about @milindrunning aesthetic pic. The obscenity lies in the minds of a viewer imagining more!
His crime is being good looking,famous & setting bench marks!
If nudity is a crime all naga babas should be arrested. Smearing ash can’t make it acceptable! pic.twitter.com/vTTAK8whIi— Pooja Bedi (@poojabeditweets) November 8, 2020