telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

“మహర్షి”కి దక్కిన మరో అరుదైన ఘనత

Maharshi

సూపర్ స్టార్ మ‌హేష్ బాబుహీరోగా వంశీ పైడిప‌ల్లి దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మ‌హ‌ర్షి”. పూజా హెగ్డే క‌థానాయిక‌గా న‌టించిన ఈ చిత్రంలో అల్ల‌రి న‌రేష్ ముఖ్య పాత్ర పోషించాడు. వెంకటేశ్వర క్రియేషన్స్‌, పీవీపీ సినిమా, వైజయంతి మూవీస్‌ బ్యానర్లపై దిల్‌రాజు, పొట్లూరి ప్రసాద్‌, అశ్విని దత్‌ సంయుక్తంగా నిర్మించారు. దేవి శ్రీ ప్ర‌సాద్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించి ఎపిక్ బ్లాక్ బ‌స్ట‌ర్‌గా నిలిచిన మ‌హ‌ర్షి చిత్రం రీసెంట్‌గా వంద రోజులు పూర్తి చేసుకుంది. చిత్ర దర్శ‌కుడు వంశీ పైడిప‌ల్లి. ఫిలాస‌ఫిక‌ల్ పాయింట్‌కి క‌మ‌ర్షియ‌ల్ అంశాన్ని జోడించి చిత్రాన్ని చాలా అందంగా తెర‌కెక్కించారు. రిషి జీవితంలో మూడుదశల్ని ప్రతిబింబిస్తూ కథను అల్లుకున్నారు. చిత్రంలో మహేష్‌బాబు, అల్లరి నరేష్, పూజాహెగ్డే మధ్య స్నేహాన్ని ఆవిష్కరించారు. ద్వితీయార్థంలో రైతు సమస్యలపై ఎక్కువగా దృష్టిపెట్టారు. అన్నదాత దుస్థితిని అర్థవంతమైన సన్నివేశాలు, సంభాషణలతో చెప్పే ప్రయత్నం చేశారు. ఊరి మేలు కోసం రిషి ఎంతవరకు పోరాటం చేశాడనే అంశాన్ని ఉద్వేగభరితంగా ఆవిష్కరించారు. తాజాగా ఈ చిత్రం 2019 సంవ‌త్సరానికి గాను ట్విట్ట‌ర్‌లో అత్యంత ప్ర‌భావితం చేసే అంశాల‌లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ మ‌హేష్ బాబు ఫ్యాన్స్‌కి కృత‌జ్ఞ‌తలు తెలియ‌జేసింది. మ‌రో ముఖ్య విశేష‌మేమంటే అజిత్ న‌టించిన విశ్వాసం చిత్రం తొలి స్థానం సంపాదించుకుంది. శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ చిత్రంలో న‌య‌న‌తార క‌థ‌నాయిక‌గా న‌టించ‌గా, జ‌గ‌ప‌తి బాబు ముఖ్య పాత్ర పోషించాడు.

Related posts