కర్ణాటక రాష్ట్రంలో జరిగిన అక్రమ మైనింగ్ నేపథ్యంలో తెరకెక్కిన “కేజీఎఫ్” చిత్రం దాదాపు 200 కోట్లకి పైగా కలెక్షన్స్ రాబట్టింది. కన్నడలోనే కాక తెలుగు, తమిళం, హిందీ భాషలలో ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ప్రస్తుతం ఈ చిత్రానికి కొనసాగింపుగా చాప్టర్ 2ని భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు . ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యువ హీరో యశ్ ప్రధాన పాత్రలో మూవీ రూపొందుతుంది. ఫస్ట్ పార్ట్‌లో అధీరా అనే పాత్రని సస్పెన్స్‌లో పెట్టిన మేకర్స్ ఆ పాత్రకి సంబంధించిన ఫస్ట్ లుక్‌ని జూలై 29 విడుదల చేశారు. అధీరా పాత్రలో సంజూ భాయ్ అదరగొట్టారు. ఇక ఈ చిత్రంలో రావు రమేష్ కూడా కీలకపాత్రలో కన్పించబోతున్నట్టు ఇటీవలే దర్శకుడు ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ‘కేజీఎఫ్ 2’ సినిమాలో లేడీ పీఎమ్ పాత్రకి గాను రమ్యకృష్ణను అడిగారట. అయితే ఆ సినిమాకి గల భారీతనాన్ని, ఆ పాత్ర ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకుని రమ్యకృష్ణ పెద్ద మొత్తంలోనే పారితోషికాన్ని డిమాండ్ చేసిందట. దాంతో వాళ్లు రవీనా టాండన్ ను తీసుకున్నారట. యష్ సరసన శ్రీనిధి శెట్టి కథానాయికగా నటిస్తోంది. ఇక రమ్యకృష్ణ విషయానికొస్తే… తెలుగు, తమిళ భాషల్లో ఆమెకు ఇప్పుడు విపరీతమైన క్రేజ్ వుంది. ‘బాహుబలి’లో శివగామి పాత్ర నుంచి, కీలకమైన పాత్రలను చేస్తూ వెళుతోంది. పవర్ఫుల్ పాత్ర ఏదైనా వుంటే ముందుగా దర్శకనిర్మాతలు ఆమెనే సంప్రదిస్తున్నారు.
previous post
next post