telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

కొత్త మున్సిపల్ చట్టంపై గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు

BANDARU DATTATREYA

తెలంగాణ అసెంబ్లీ లో కొత్త మున్సిపల్ చట్టం -2019 బిల్లును సభ ఆమోదించింది. మున్సిపాలిటీ బిల్లు, పంచాయతీరాజ్ 2వ సవరణ బిల్లులకు సభ్యులు శుక్రవారం ఆమోదం తెలిపారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు కొత్త మున్సిపల్ చట్టంపై ఘాటుగా స్పందించారు. కొత్త మున్సిపల్ చట్టం రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ నేత దత్తాత్రేయ మండిపడ్డారు. వార్డుల పునర్విభజన, రిజర్వేషన్లు అప్రజాస్వామికమని ఆయన తప్పుబట్టారు.

ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను బీజేపీ నేతలు దత్తాత్రేయ, ఎమ్మెల్యే రాజాసింగ్, డీకే అరుణ తదితరులు కలిశారు. కొత్త మున్సిపల్ చట్టంపై గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు చేశారు. మున్సిపల్ చట్టానికి ఆమోదం తెలపొద్దని గవర్నర్‌ను కోరారు. అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికలపై హైకోర్టు సైతం మొట్టికాయలు వేసిందని చెప్పారు. ఏడు కార్పోరేషన్లు ఏర్పాటు ఇష్టానుసారం జరిగిందని దత్తాత్రేయ ఆరోపించారు.

Related posts