వైఎస్ షర్మిల తెలంగాణలో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా షర్మిల అన్ని జిల్లాల నేతలు, వైఎస్ అభిమానులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తాజాగా లోటస్ పాండ్ లో ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లా అభిమానులతో షర్మిల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. పచ్చటి అడవులు, కుంతాల జలపాతం.. తెలంగాణ కాశ్మీర్ మన అదిలాబాద్ జిల్లా అని..ప్రతి గడపకు పూసే పసుపు.. ప్రతి నోటిని తీపి చేసే చెరుకు అని అన్నారు. జల్ జమీన్ జంగల్ పేరుతో నిజాంకి చుక్కలు చూపిన కొమురం భీం పుట్టిన గడ్డ ఆదిలాబాద్ అని… మంత్రి పదవికి రాజీనామ చేసిన కొండా లక్ష్మణ్ బాపూజీ పుట్టిఉన గడ్డ ఆదిలాబాద్ జిల్లా అని షర్మిల పేర్కొన్నారు. ఉద్యమాన్ని నడిపిన కోదండరామ్ పుట్టిన గడ్డ ఆదిలాబాద్ అని.. జలియన్ వాలాబాగ్ ను తలపించే ఇంద్రవెల్లి ఘటన ఇంకా మనలను రగిలిస్తూనే ఉందని.. పోడు భూములకు పట్టాలు ఇచ్చి లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపిన వ్యక్తి వైఎస్సార్ అని కొనియాడారు. ప్రాణహిత – చేవెళ్ల ప్రాజెక్టు ఆదిలాబాద్ కి తలమానికమని..కానీ ప్రాజెక్ట్ కు రీడిజైన్ చేసి రెండు జిల్లాలకు అన్యాయం చేశారని టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. దేశంలో పసుపు ఉత్పత్తిలో నిజామాబాద్ నెంబర్-1 అని.. పసుపు బోర్డ్ తెస్తాను అని చెప్పి బీజేపీ ఎంపీ అరవింద్ బాండ్ పేపర్ ఇచ్చారని మండిపడ్డారు. బాండ్ ఇచ్చి రైతులను అరవింద్ మోసం చేశాడని..బాన్సువాడలో మతకల్లోలకు కారణం ఎవరు? అని నిలదీశారు. రాజన్న సంక్షేమం కోసం నేను నిలబడుతమీకోసం నేను పోరాడుతానని.. ఇప్పుడు ఈ జిల్లాలో భూములు రెట్లు పెరిగాయంటే వైఎస్ఆర్ కారణమని తెలిపారు.
previous post
next post
హుజూరాబాద్ ప్రజల చేతిలో తెలంగాణ ప్రజల భవిష్యత్: రేవంత్