telugu navyamedia
వార్తలు సామాజిక

తమిళనాడులో కరోనా కన్నెర్ర..మరో 89 మంది మృతి

corona

తమిళనాడులో కరోనా కన్నెర్ర చేయడంతో అక్కడ రోజురోజుకూ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదవుతుండడంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా నిన్న వైరస్ సోకి 89 మంది మృత్యువాత పడ్డారు. దీంతో కొవిడ్ కారణంగా మృతి చెందిన వారి సంఖ్య 3,490కి పెరిగింది.మొత్తం కేసుల సంఖ్య 2 లక్షల మార్కును దాటేసి 2,06,737గా నమోదైంది.

కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. నిన్న ఒక్క రోజే 7,758 మంది కోలుకుని డిశ్చార్జ్ అవడంతో మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 1,51,055కు పెరిగింది. రాష్ట్రంలో ఇంకా 52,273 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.గత 24 గంటల్లో రాష్ట్రంలో 64,315 నమూనాలు సేకరించారు. రాష్ట్రవ్యాప్తంగా రాజధాని చెన్నైలోనే ఎక్కువ కేసులు నమోదవుతుండడంతో అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.

Related posts