telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

మరో సర్ప్రైజ్ ఇవ్వనున్న ప్రభాస్…

బాహుబలి తర్వాత పాన్ ఇండియా హీరోగా మారిన రెబల్ స్టార్ ప్రభాస్ అప్పటి నుండి అన్ని పాన్ ఇండియా సినిమాలు ఇచ్చేస్తున్నాడు. ఇప్పుడు ప్రభాస్ వరుస సనిమాలు చేస్తున్నాడు. ఓరాస్తుతం ప్రభాస్ ఆదిపురుష్, సలార్ సినిమా షూటింగ్‌లలో పాల్గొననున్నాడు. అయితే ఇటీవల ప్రభాస్ చేసిన తాజా చిత్రం రాధేశ్యామ్. ఇందులో బుట్టబొమ్మ పూజ హెగ్దె హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా చిత్రీకరణ కాస్త ఆలస్యం అయినా ఎట్టకేలకు పూర్తయింది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. అయితే ఈ సినిమా లో మ్యూజిక్ డైరెక్టర్ గురించి తెలుపుతూ నిన్న ఓ అప్‌డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఇక ఈరోజు మరో కొత్త అప్డేట్ తో వచ్చారు. ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు కానున్నకానుకగా ఈ చిత్రం నుంచి గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేస్తున్నామని ప్రకటిస్తూ తాజాగా ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. అయితే ఈ సినిమాకు హిందీలో మిథున్ మనన్ భరధ్వాజ్ సంగీతం అందిస్తుండగా… తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ స్వరాలు సమకూర్చనున్నాడు. చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుంది అనేది.

Related posts