telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

ఆర్ఆర్ఆర్ : సర్ ప్రైజ్ వచ్చేసింది

దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. టాలీవుడ్‌లో భారీ మల్టీస్టారర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా పై దర్శకుడు టీజర్ లతో అంచనాలను మరింతగా పెంచేశారు. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్, కొమరం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తోన్న సంగతి తెలిసిందే. రామ్ చరణ్‌కు జంటగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ నటిస్తుండగా.. ఎన్టీఆర్ సరసన ఇంగ్లిష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తున్నారు. అయితే.. చరణ్ పుట్టిన రోజుకు కాస్తంత ముందుగానే ‘ట్రిపుల్ ఆర్’లో అతను పోషిస్తున్న రామరాజు పాత్రకు సంబంధించిన కలర్ ఫుల్ పోస్టర్ ను విడుదల చేశాడు. విశేషం ఏమంటే… విల్లంబును ఎక్కు పెట్టిన రామరాజుగా రామ్ చరణ్ సూపర్ గా ఉన్నాడు. ఈ పోస్టర్ ను ట్వీట్ చేస్తూ, ‘ధైర్యం, గౌరవం, సమగ్రత… కలిగిన మా సీతారామరాజును మీకు పరిచయం చేస్తున్నాను అంటూ రాజమౌళి ట్వీట్ చేశాడు. గొప్ప లక్షణాలు ఉన్న సోదరుడు ఇతనంటూ ఎన్టీయార్ సైతం అదే పోస్టర్ ను ట్వీట్ చేశాడు. అల్లూరి సీతారామరాజు పాత్ర పోషించడం నా అదృష్టం’ అంటూ రామ్ చరణ్ సైతం ఆ పోస్టర్ ను పోస్ట్ చేసి పేర్కొన్నాడు. 

Related posts