telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కరోనాపై ఎస్పీ బాలు చివరి పాట…!

SPB

గాన గంధర్వుడు ఎస్పీ బాలు “శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ఇక లేరనే వార్తతో దేశం శోకసంద్రంలో మునిగిపోయింది. బాలు మృతిపై పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలు పాడి సంగీత ప్రియుల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు బాలు. ఆయన పాడిన చివరి పాట ‘పలాస 1978’ సినిమాలోని ‘ఓ సొగసరి’ అనే పాటనే ఆయన ఆలపించిన చివరి పాట అని చెబుతున్నారు. లక్ష్మీ భూపాల రాసిన పాటను రఘు కుంచె సంగీతాన్ని అందించారు. ఎస్పీ బాలు, బేబి కలిసి ఈ పాటను ఆలపించారు. ఇక, దీనిపై మ్యూజిక్ డైరెక్టర్‌ రఘు కుంచె మాట్లాడుతూ.. పలాస చిత్రంలో బాలు పాట పాడడం తన అదృష్టంగా చెప్పుకొచ్చారు. మరోవైపు బాలు పాడిన చివరి పాట ఇదేనంటూ… కరోనాపై బాలు పాడిన సాంగ్ వీడియో ఒకటి వైరల్ అవుతోంది.

ఇక ఈరోజు సాయంత్రం 4 గంటలకు ఎంజీఎం నుంచి కోడంబాకంలోని ఎస్పీ చరణ్‌ ఇంటికి బాలు పార్థివదేహాన్ని తరలిస్తున్నారు. అభిమానుల సందర్శనార్థం కోడంబాకంలో బాలు పార్థివదేహాన్ని ఉంచుతారు.. అనంతరం రేపు సాయంత్రం చెన్నై తిరువళ్లూరు జిల్లాలో రేపు బాలు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. రెడ్‌హిల్స్‌ సమీపంలోని తామరైపాకంలో బాలు పార్థివదేహానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు

Related posts