telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

లాక్‌డౌన్‌పై సీఎం కేసీఆర్‌ కీలక ప్రకటన

తెలంగాణలో కరోనా విలయం కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 3 లక్షలు దాటేశాయి. మొదట్లో 100 నుంచి 150 కేసులు నమోదయ్యే కరోనా కేసులు.. ఇప్పుడు 500పైగా నమోదు అవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో లాక్‌ డౌన్‌ విధిస్తారని కొన్ని రోజులుగా ప్రచారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. పక్క రాష్ట్రం అయిన మహారాష్ట్రలోని కొన్ని నగరాల్లో ఇప్పటికే లాక్‌డౌన్‌ ప్రకటించారు. అయితే.. తెలంగాణలో లాక్‌డౌన్‌ పై ఇవాళ అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. తెలంగాణలో ఇక లాక్ డౌన్ ఉండబోదని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు సీఎం కేసీఆర్‌. పరిశ్రమల మూసివేత కూడా ఉండబోదని..తొందరపాటు నిర్ణయాలు ఉండవన్నారు సీఎం కేసీఆర్‌. ప్రజలెవరూ భయపడవద్దని..పెండ్లిల కూడా జనం తగ్గించుకోవాలని సూచించారు. గతేడాది లాక్‌డౌన్‌తో ఆర్థికంగా చాలా నష్టపోయామని సీఎం కేసీఆర్‌ తెలిపారు. సెల్ఫ్ కంట్రోల్… సెల్ఫ్ డిసిప్లిన్ ముఖ్యమని తెలిపారు. కరోనా కారణంగా విద్యాసంస్థలు మూసివేయడం బాధాకరమేనని.. స్కూళ్ల మూసివేత తాత్కాలికమన్నారు. కరోనా వ్యాక్సిన్ మన చేతిలో లేదని…మన వాటా మనకు వస్తుందన్నారు. ప్రధాని కూడా కరోనా వ్యాక్సిన్‌పై స్పష్టతతో ఉన్నారన్నారని తెలిపారు.

Related posts